Hyderabad: బర్త్డే పార్టీకి గోవా నుండి డ్రగ్స్..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎస్ ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అపార్ట్మెంట్లో నిర్వహించిన బర్త్డే పార్టీలో ఇంజినీరింగ్ విద్యార్థులు గోవా నుండి డ్రగ్స్ తెప్పించుకొన్నట్లు సామాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు టిఎస్న్యాబ్ అధికారులు, ఎస్ ఆర్ నగర్ పోలీసులు కలిపి దాడి చేశారు. మొత్తం 12 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి 60 డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఐటి ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. వీరంతా నెల్లూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.