దేశ‌ప్ర‌గ‌తి, యువ‌త‌, మ‌హిళ‌లు, పేద‌లు, రైతులే అజెండా.. బిజెపి

ఢిల్లీ (CLiC2NEWS): ‘సంక‌ల్ప ప‌త్రం’ పేరుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. దేశ‌ప్ర‌గ‌తి, యువ‌త‌, మ‌హిళ‌లు, పేద‌లు, రైతులే అజెండాగా రూపొందిచిన‌ట్లు బిజెపి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది స‌భ్యుల క‌మిటి సంక‌ల్ప ప‌త్రాన్ని (మేనిఫెస్టో) రూపొందించింది. దీనికోసం దాదాపు 15 ల‌క్ష‌ల స‌ల‌హాలు సూచ‌న‌లు ప‌ర‌శీలించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ధాని న‌రేంద్ర మోడి, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌, నిర్మ‌లా సీతారామ‌న్ ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు.

70 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు ఆయుష్మాన్ భార‌త్‌లో భాగంగా రూ. 5 లక్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్యం
మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం

మ‌రో ఐదేళ్లు ఉచిత రేష‌న్‌

పైప్‌లేన్ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్

మూడు కోట్ల మంది మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారుల‌గా మార్చే ప్ర‌ణాళిక‌

మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్సాహం

విదేశాల్లోని భార‌తీయుల భ‌ద్ర‌త‌కు హామీ

ఉద్యోగ నియామ‌కాల్లో పేప‌ర్ లీకేజీల నివార‌ణ‌కు క‌ఠిన చ‌ట్టం, పారద‌ర్శ‌కంగా నియామ‌క ప్ర‌క్రియ‌

వందే భార‌త్ విస్త‌ర‌ణ‌..

Leave A Reply

Your email address will not be published.