హ‌నుమ‌కొండ, వ‌రంగ‌ల్‌ న్యాయ‌స్థానాల‌కు బాంబు బెదిరింపు కాల్‌..!

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లా న్యాయస్థానాలోలో బాంబు పెట్టిన‌ట్లు బెదిరింపు కాల్స్ క‌ల‌క‌లం రేపాయి. కోర్టులో బాంబు పెట్టిన‌ట్లు ఓ దుండ‌గుడు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కోర్టు సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే గ‌తంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. తాజాగా మ‌రోసారి రావ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.