కోల్‌కతా విమానాశ్రయంలో బాంబు కలకలం..

కోల్‌కతా (CLiC2NEWS): కోల్‌కతా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో కోల్‌కతాలోని ది నేతాజి సుభాశ్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోల్‌కతా నుండి ముంబయి వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు విమానాశ్రయ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కోల్‌కతా నుండి ఇండిగో విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు ముంబయి చేరుకోవాల్సి ఉంటుంది. 195 మంది
చెక్ఇన్ బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అత్యవసర ప్రకటన చేశారు.
విమానంలోని ప్రయాణికులు, లగేజిని కిందికి దింపి, విమానాన్ని ఐసోలేషన్ బేలోకి తీసుకెళ్లి తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువలేవీ కనిపించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత బాంబు బెదిరింపు రావడం ఇది రెండవసారి. మే 6వ తేదీన ఛండీగడ్‌నుండి ముంబయికి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చంది.