24 గంటల వ్యవధిలో 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 20కి పైగా విమానాలకు బెరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పదార్ధాలు లభించలేదు. గడిచిన వారం రోజులుగా దాదాపు 70కి పైగా విమానాలకు ఇటువంటి నకిలీ బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజామున నుండి వస్తున బెదిరింపులతో విమానాలను అత్యవసరంగా లాండ్ చేసి తనిఖీలు నిర్వహించారు. మరి కొన్ని విమానాలను టేక్ఆఫ్ ముందే ఆపేసి తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. బాంబు బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై నిషేధం విధించే అవకాశం ఉందని పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.