నిమ్స్ ఆసుపత్రిలో ఘనంగా బోనాల ఉత్సవం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని నల్లపోచమ్మ ఆలయంలో బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో నిమ్స్ డాక్టర్లు, సిబ్బంది అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్త రమేష్ మాట్లాడుతూ.. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో ఏటా బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుందన్నారు. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందితో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశామని ఆయన తెలిపారు. కరోనా తగ్గే వరకు ప్రతీ ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మార్త రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఆసుపత్రికి వచ్చే రోగులు తదితరులు పాల్గొన్నారు.