Olympics: భజరంగ్ పూనియాకు కాంస్యం.. భారత్‌కు మరో పతకం

టోక్యో (CLiC2NEWS): అందరూ అనుకున్నట్లే ఒలింపిక్స్‌లో భజరంగ్ పూనియా పతకం సాధించాడు. దాంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా గెలిచాడు. కజకిస్థాన్‌కు చెందిన నియాజ్బెకోవ్ దౌలెత్ను 8-0 తేడాతో బజరంగ్ పునియా చిత్తుచేశాడు. ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా టోక్యో బరిలో దిగిన బజరంగ్ పునియా.. సెమీఫైనల్లో అజర్‌బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.
- భజరంగ్ ఫస్ట్ పీరియడ్‌లో మొదట ఓ పాయింట్ సాధించాడు.
- 2 సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్ ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు మంచి పోటీ ఇచ్చాడు.
- ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్‌ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
- దీంతో ఆ పీరియడ్‌లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది.
- సెకండ్ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు.
- ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించి భజరంగ్ పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు.
- ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. దాంతో భజరంగ్ గెలుపు ఖాయం చేసుకున్నాడు.
Wow, awesome blog layout! How lengthy have you been running a blog for? you made running a blog look easy. The total glance of your web site is excellent, as smartly as the content!!