Olympics: భ‌జ‌రంగ్ పూనియాకు కాంస్యం.. భారత్​కు మ‌రో పతకం

టోక్యో (CLiC2NEWS): అంద‌రూ అనుకున్న‌ట్లే ఒలింపిక్స్​లో భ‌జ‌రంగ్ పూనియా ప‌త‌కం సాధించాడు. దాంతో భార‌త్ ఖాతాలో మరో పతకం చేరింది. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో టాప్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా గెలిచాడు. కజకిస్థాన్​కు చెందిన నియాజ్​బెకోవ్​ దౌలెత్​ను 8-0 తేడాతో బజరంగ్​ పునియా చిత్తుచేశాడు​. ఎన్నో అంచనాలతో ఫేవరేట్​గా టోక్యో బరిలో దిగిన బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు.

  • భ‌జ‌రంగ్ ఫ‌స్ట్ పీరియ‌డ్‌లో మొద‌ట ఓ పాయింట్ సాధించాడు.
  • 2 సార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో మెడ‌ల్ కొట్టిన దౌల‌త్ ఈ మ్యాచ్‌లో భ‌జ‌రంగ్‌కు మంచి పోటీ ఇచ్చాడు.
  • ఫ‌స్ట్ పీరియ‌డ్ ముగింపులో మ‌రో పాయింట్‌ను భ‌జ‌రంగ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.
  • దీంతో ఆ పీరియ‌డ్‌లోకి అత‌నికి 2-0 లీడ్ వ‌చ్చింది.
  • సెకండ్ పీరియ‌డ్ ఆరంభంలోనే భ‌జ‌రంగ్ రెండు పాయింట్లు సాధించాడు.
  • ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండేసి పాయింట్ల‌ను రెండు సార్లు సాధించి భ‌జ‌రంగ్ పూర్తి ఆధిపత్యాన్ని నెల‌కొల్పాడు.
  • ఆ పీరియ‌డ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. దాంతో భ‌జ‌రంగ్ గెలుపు ఖాయం చేసుకున్నాడు.
1 Comment
  1. SEO says

    Wow, awesome blog layout! How lengthy have you been running a blog for? you made running a blog look easy. The total glance of your web site is excellent, as smartly as the content!!

Reply To SEO
Cancel Reply

Your email address will not be published.