సిద్దిపేట జిల్లాలోని నంగునూర్‌లో యువకుడి దారుణ హత్య

సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలోని నంగునూర్‌ మండలంలోని బద్దిపడగ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు యువ‌కుడిని హత్యచేశారు. స్థానికులు శనివారం ఉదయం గుర్తించి పోలీసులకు స‌మాచారామిచ్చారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడిని కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన రాజశేఖర్‌ (28)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.