వ‌చ్చే ఏడాదికి దేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్  4జి సేవ‌లు..

గుంటూరు (CLiC2NEWS):  ప‌ట్ట‌ణ ప్రాంతాల‌తో పాటు గ్రామాల‌లో కూడా ఇంట‌ర్‌నెట్ సేవ‌లు అందించ‌డ‌మే బిఎస్ఎన్ఎల్ ల‌క్ష్య‌మ‌ని, 2025 నాటికి దేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4జి సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని మంత్రి పెమ్మ‌సాని చంద్రశేఖ‌ర్ తెలిపారు. ఆయ‌న గుంటూరు జిల్లా తాడికొండ‌లో నూత‌న దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ .. విద్యుత్ ఎంత ముఖ్య‌మో .. నాణ్య‌మైన ఇంట‌ర్నెట్ సేవ‌లు కూడా అంతే ముఖ్య‌మ‌ని  అన్నారు.

లాభాపేక్ష లేకుండా మారుమూల ప‌ల్లెల‌కు ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించాల‌న్న‌దే ప్ర‌ధాన‌మంత్రి ఉద్దేశ‌మ‌ని మంత్రి  అన్నారు. ప్రేవేటు సంస్త‌లు మారుమూల గ్రామాల‌కు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌లేవ‌ని, 4,500 ట‌వ‌ర్లు ఏర్పాటు చేసి నాణ్య‌మైన 4జి సేవ‌ల‌ను ప్రజ‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.