ప్రతీ కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా: ప్రవీణ్ కుమార్
బిఎస్పి ఎన్నికల మేనిఫెస్టో విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): బహుజన సమాజ్వాదీ పార్టీ () ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు, ప్రతి మండలం నుండి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, ప్రతి పంటకు మద్దతు ధర.. ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య బీమా .. ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్, భీం రక్షా కేంద్రాలు కింద వృద్దులకు వసతి. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు ఐదేళ్లో 10 లక్షల ఉద్యోగాలు.. వీటిలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు.