ఎర్రగడ్డలో అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్ (CLiC2NEWS): ఎర్రగడ్డలో రైతుబజార్ సిగ్నల్ వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ఆగి ఉన్నవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. భయంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. కార్లు ధ్వాంసమయ్యాయి. ఎర్రగడ్డ నుండి ఇఎస్ ఐ వైపుకు వెళ్తున్న ధనుంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సు రైతు బజార్ సిగ్నల్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి కారణమైంది. సిగ్నల్ పడటంతో అప్పటికే ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలు కార్లు నిలిచిఉన్నాయి. దీంతో ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.