రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
పోలీసు శాఖలో 3,966 పోస్టులు..,ఆర్ అండ్ బి శాఖలో 472 పోస్టులు.., బిసి గురుకుల పాఠశాలల్లో 2,591 పోస్టులు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షనత సమావేశమైన మంత్రివర్గం రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. సైబర్ సేప్టీ బ్యూరో పరిధిలో మొత్తం 3,966 పోస్టుల ర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల నియామకానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినేట్ ఆదేశించింది. రాష్ట్రంలో డ్రగ్స్ నేరాల నియంత్రణపై మంత్రివర్గం చర్చలు జరిపింది. పోలీస్ శాఖలను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బిసి గురుకులాల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 ఉద్యోగాల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో నియామకాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఆర్ అండ్ బి శాఖలో 472 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలోని రోడ్లు, భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
పని వస్తృతి పెరుగుతున్నందున దానికి అనుగుణంగా ఈ శాఖలోని పలు విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అవసరం మేరకు నూతన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈశాఖలో చీఫ్ ఇంజనీర్ పోస్టులు 3, సూపరింటెండెంట్ 12, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ 13, డిఇఇ పోస్టులు 102, అసిస్టెంట్ ఇఇ పోస్టులు 163, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ 28 పోస్టులతో పాటు పలు టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
Woh I enjoy your posts, saved to favorites! .
Merci Laurent pour ces informations. En effet, peu d’expatriés le savent. Je viens de l’apprendre grâce à cet article et malheureusement c’est trop tard pour cette année.Comment peut-on s’inscrire au Registre des Français établis hors de France ?
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?