కులగణన నివేదికకు మంత్రివర్గం ఆమోదం
హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 2 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో సమగ్ర కులగణన , ఎస్‌సి వర్గీకరణ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ..దేశంలో మొదటి సారి కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు.
సామాజిక, ఆర్ధిక, ఉపాధి , విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జరిగిన కేబినేట్ భేటీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు సర్వే కొనసాగిందని, రాష్ట్రంలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశామని సిఎం తెలిపారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన నిర్వహించామని, దీనికి మొత్తంగా రూ.125 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించామని సిఎం తెలిపారు.