అర్థరాత్రి హైదరాబాద్‌లో కారు బీభత్సం

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. నగరంలోని మాదాపూర్, హైటెక్‌సిటీ నోవటెల్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢి కొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయాలపాలైన వారికి కారుని బయటకు తీశారు. పోలీసులు వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు వేగంగా నడపటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.