secunderabad: వైఎంసిఎ ఫ్లై ఓవ‌ర్‌పై కారు ద‌గ్ధం

హైద‌రాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ లోని వైఎంసిఎ ఫ్లైఓవ‌ర్‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగాయి. దాంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కారు డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆపి ఆ వెంట‌నే కారులో నుంచి డ్రైవ‌ర్ దిగిపోయాడు. ఈ ప్ర‌మాదాంతో అటుగా వ‌స్తున్న‌ వాహ‌నాలు భారీగా ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌టాన‌స్థ‌లికి వ‌చ్చేస‌రికే కారు పూర్తిగా కాలిపోయింది.

Leave A Reply

Your email address will not be published.