టోల్‌ప్లాజా వద్ద కానిస్టేబుల్‌పై నుండి దూసుకుపోయిన కారు
కాకినాడ (CLiC2NEWS): వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కానిస్టేబుల్ మీదనుండి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. న్యూఇయర్ సందర్బంగా జిల్లాలోని కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. జగ్గంపేట, సిఐ, కిర్లంపూడి ఎస్ ఐ , సిబ్బంది ఉన్నారు. అర్దరాత్రి సుమారు ఒంటిగంటన్నర సమయంలో విశాఖ నుండి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కారును తనిఖీ చేస్తుండగా.. ఒక్కసారిగా దూసుకుపోయింది. ఆసమయంలో కారు ఎదురుగా ఉన్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ పై నుండి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ లోవరాజుకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకోగా .. అతనిని ఆస్పత్రికి తరలించారు. కారు ను రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. కారులో గంజాయి తరలిస్తున్నట్లు స మాచారం.