హైకోర్టు సీనియర్ న్యాయవాదిపై కేసు నమోదు

హైదరాబాద్ (CLiC2NEWS): ఎమ్మెల్యేతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నగరంలోని హైకోర్టు సీనియర్ న్యాయవాదిపై సిసిఎస్‌లో కేసు నమోదైంది. న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదైంది. మల్కాజిగిరికి చెందిన యాదగిరి భూమి విషయంలో న్యాయవాదిని ఆశ్రయించగా.. తీర్పు తనకు అనుకూలంగా వచ్చే విధంగా చేస్తానని రెండు విడతల వారీగా రూ. 7 కోట్లు తీసుకున్నారని తెలిపాడు. కానీ , కోర్టులో తీర్పు తనకు అనుకూలంగా రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాదిని కోరాడు. వెంకటరమణ రూ. కోటి ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వలేదని, మలక్ పేట ఎమ్మెల్యే బలాల, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.