నల్గొండ జిల్లా వ్యాప్తంగా 14 హెల్త్ సెంటర్లపై చర్యలు..

నల్గొండ (CLiC2NEWS): రాష్ట్రంలోని నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 14 హెల్త్ సెంటర్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్నారు. వీరు గతంలో కాంపౌండర్లగా పనిచేసి ప్రస్తుతం వైద్యులుగా పేషెంట్లకు యాంటి బయోటిక్స్, స్టిరాయిడ్స్ ఇస్తున్నారు. అలాంటి వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. వారిపై సంబంధిత పిఎస్‌లలో కేసులు నమోదు చేయించింది. నకిలీ వైద్యులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ వెల్లడించారు.