పోలీస్‌స్టేషన్‌లో రూ. 5.6 లక్షలు కాజేసిన హోంగార్డు..
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/Adoni-Police-Station.jpg)
ఆదోని (CLiC2NEWS): తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే చోరీకి పాల్పడ్డడు ఓ హోంగార్డు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ రెండో పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న హోంగార్డు మనోజ్ స్టేషన్‌లో ఉన్న రే. 5.63 లక్షల నగదును కాజేశాడు. వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును స్టేషన్‌లలో భద్రపరుస్తుంటారు. మనోజ్.. పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో బీరువా తాళాలు అతనికి ఇస్తుండేవారు. ఫైల్స్ తీసుకురమ్మని చెప్పేవారు. ఈ క్రమంలో బీరువాలో ఉంచిన నగదును మనోజ్ కాజేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 3లక్షల నగదును రికవరీ చేసినట్లు సమాచారం.