Election code: పండుగలు, పెళ్లిళ్లకు ఆభరణాలు కొనాలంటే..
మంచిర్యాల (CLiC2NEWS): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలు రూ. 50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలంటే భయపడుతున్నారు. దసరా.. దీపావళి పండుగ సీజన్ కావడంతో కుటుంబసభ్యులకు గాని, బంధువలుకు గాని గిప్ట్లు కొనాలన్నా భయపడుతున్నారు. దీపావళి తర్వాత శుభముహూర్తాలు.. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీంతో బంగారం కొనాలంటే.. ఎక్కడ పోలీసులు నగదు సీజ్ చేస్తారోనని ముందుకు రావడం లేదు. తులం బంగారం కొనాలన్నా ఎన్నికల నియమావళి ప్రకారం రూ. 50వేలు కంటే ఎక్కువ నగదు రవాణా చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నగరంలో బంగారం, వెండి విక్రయాలు తగ్గుముఖం పట్టాయని , ఇది పండగ సీజన్లా లేదని దుకాణదారులు వాపోతున్నారు.