ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టిడిపి అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రి వైద్యులు మంగళవారం చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు రోజుల క్రితం ఎఐజిలో పలు వైద్యపరీక్షలు చేయించుకొన్నారు. సోమవారం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి.. చర్మ సంబంధిత చికిత్స అందించినట్లు సమాచారం.