విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన కస్టమ్స్ అధికారులపై కేసు

హైదరబాద్ (CLiC2NEWS): విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించారనే ఆరోపణలతో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ఎ. శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, పేరి చక్రపాణిలపై కేసులు నమోదు చేశారు. 2023 మార్చి 16న శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 4 లక్షల భారతీయ కరెన్సీ, రూ. 2,93,425 లకు సమానమైన విదేశీ కరెన్సీని ——సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.