CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

న్యూఢిల్లీ (CLiC2NEWS): సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా ఇవాళ ఐపిఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. CBI డైరక్టర్‌గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు నిర్వర్తించనున్నారు. మహారాష్ట్ర క్యాడర్, 1985 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన, పార్లమెంట్‌లో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇతడిని నియమించింది. కాగా, డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.