సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
గీసుగో౦డ (CLiC2NEWS): సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీసుగో౦డ మండలం మచ్చాపూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ నన్నెం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వరంలో దేశ రక్షణ కోసం తమ కొడుకులను సైన్యం లోకి పంపిన తల్లులను సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య మిత్రలు, అంగన్వాడీ టీచర్లు అందించిన సేవలను ఈ సందర్భంగా ఛైర్మన్ కొనియాడారు.
మేనేజింగ్ డైరెక్టర్ కక్కెర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాతీ పునరుజ్జీవం మహిళా అభ్యున్నతితోనే సాధ్యపడుతుందన్నారు. స్త్ర్తీల ఆర్థిక స్వావలంబన ,భద్రత తోపాటు స్త్రీల హక్కుల కోసం తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పాటుపడుతుంది అని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో అంగన్వాడీ టీచర్లు… రామతార , నిర్మల, డ్వాక్రా CA లు సరిత, జ్యోతి, నిర్మల, ఆరోగ్య మిత్రలు నాగమణి, రాధిక,నర్మదలకు.. అలాగే ముఖ్యంగా దేశ రక్షణ కోసం తమ కొడుకులను సైన్యం లోకి పంపిన మాతృమూర్తులైన మర్రి మల్లమ్మ , సిరికొండ రాంబాయి,లక్క మల్లికాంబ, న్యాడం లక్ష్మిలకు ఫౌండేషన్ ఛైర్మన్ నన్నెం రాజ్యలక్ష్మి మేనేజింగ్ డైరెక్టర్ కక్కెర్ల శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళామణులకు చీర జాకెట్ పెట్టి శాలువాతో సత్కరించారు.
