మండపేటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవపు వేడుకలు

సీతానగరం ( CLiC2NEWS): ఏడిద సీతానగరం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో సర్పంచ్ వరదా లక్ష్మిజాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గ్రామ వాలంటరీ వ్యవస్థ ఎంతో పటిష్టంగా అమలు జరుగుతుందని కరోనా వైరస్ నిర్మూలనలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేయడం వల్ల ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరదా చక్రవర్తి, గ్రామ కార్యదర్శి విస్సా వెంకటరమణ, హైకోర్టు న్యాయవాది వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ టీవీ గోవిందరావు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సత్యశ్రీ రోడ్డులో ఉన్న లయన్స్ క్లబ్ కళ్యాణమండపం వద్ద లయన్స్ అధ్యక్షుడు వాదా ప్రసాదరావు జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహనీయుల బాటలో నడుచుకోవాలి అన్నారు. సమాజం పట్ల దేశం పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవాలి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చి భారత ప్రజలకు స్వేచ్ఛ పూరిత వాతావరణం కల్పించారని అన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుల ఆశయసాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని అన్నారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు కర్రి నారాయణ రెడ్డి, చక్కా రాంబాబు, చెన్నా రాంబాబు, కాళ్ళ సూర్యప్రకాశ్ రావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.