Huzurabad: ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో హుజూరాబాద్ రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి. కాగా ఈ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది.
హుజూరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో వ్యయ పరిశీలకుడిని ఇసి నియమించింది.