గుంటూరు: శంకర్‌విలాస్ ప్లైఓవర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

గుంటూరు (CLiC2NEWS): నగర వాసులకు కేంద్రప్రభుత్వం శుభవార్తనందించింది. శంకర్ విలాస్ ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.98 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి , కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. నిధులు మంజూరు చేయడంపై ఎపి సిఎం చంద్రబాబు .. మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సిఆర్ ఎఫ్ పథకం కింద రాష్ట్రంలో 200.6 కిలోమీటర్ల మేర 13 రాష్ట్ర రహదారులకు రూ. 400 కోట్లు మంజూరయినట్లు సమాచారం. దీనిలో గుంటూరులో వంతెనకు రూ. 98కోట్లు మంజూరయ్యాయి.
గుంటూరులోని శంకర్ విలాస్ ప్లైఓవర్ ఇరుకుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్‌డియే అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ నిర్మిస్తామని టిడిపి లోక్‌సభ అభ్యర్థి , ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ సమస్యను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లాగా.. నిధుల మంజూరయ్యాయి.