ఒయులోని డిడిఎంఎస్ లిట‌ర‌సీ హౌజ్‌లో స‌ర్టిఫికెట్ కోర్సులు..

DDMS: ఉస్మానియా యూనివ‌ర్సిటిలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మ‌హిళా స‌భ (డిడిఎంఎస్) లిట‌ర‌సి హౌజ్‌లో వివిధ స‌ర్టిఫికెట్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సుల‌కు ఏప్రిల్ 6వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వ‌యో ప‌రిమితి లేదు.

ఎంఎస్ ఆఫీస్ ఇంట‌ర్నెట్‌, ట్యాలి ప్రైమ్‌, పైథాన్‌, బ్యూటిషియ‌న్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కెరీర్ గైడెన్స్, టైల‌రింగ్, డిజైన‌ర్ బ్లౌజెస్‌, డ్రెస్ డిజైనింగ్, మ‌గ్గం వ‌ర్క్‌, జూట్ బ్యాగ్ మేకింగ్‌, హ్యాండ్ ఎంబ్రాయిడ‌రీ త‌దిత‌ర కోర్సులు క‌ల‌వు.

స‌మ్మ‌ర్ క్యాంప్‌.. ఏడేళ్ల పైబ‌డిన పిల్ల‌ల‌కు పాట్ పెయింటింగ్ , గ్లాస్ పెయింటింగ్, డిజైన‌ర్ పేప‌ర్ బ్యాగ్స్ , ఫ్యాబ్రిక్ పెయింటింగ్,యోగా, ఫ్ల‌వ‌ర్ మేకింగ్ , జ్యూవెల‌రీ మేకింగ్ త‌దిత‌ర కోర్సులు అందిస్తున్నారు.

కోర్సుల్లో చేరేందుకు ముందు వ‌చ్చిన వారికి ప్ర‌థ‌మ ప్రాతిప‌దిక‌న సీట్లు కేటాయిస్తారు. కోర్సుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వారికి స‌ర్టిఫికెట్స్ అంద‌జేస్తారు. పూర్తి వివ‌రాల‌కు 6281139282 నెంబ‌ర్లలో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.