చల్లని కబురు.. ముందుగానే `నైరుతి`
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/rains.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతారణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ యేడాది నైరుతి రుతు పవనాలు కాస్త ముందుగా రానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే నెల 19 వ తేదీ కల్లా దక్షిణ అండమాన్ దీవుల్లోకి నైరుతి రుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే దక్షిన కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించిది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు చోట్ల తేలికపాటి వర్షం పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.