ఒయు పీజీ పరీక్ష తేదీల్లో మార్పు
హైదరాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్), ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 14 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అలాగే ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును పొడగించారు. ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజును రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అలాగే బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ర్టీ కోర్సు మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజును ఈ నెల 19 వరకు చెల్లించవచ్చును.