శిథిలీకరణ వ్యాయమముతో మోకాళ్ల నొప్పుల‌కు చెక్‌

శిథిలీకరణ వ్యాయామములో రెండ‌వ‌ది

ముందుగా నిటారుగా నిలబడి రెండు పాదాలను కలిపి ఉంచి, రెండు చేతులను ఇరు ప్రక్కల భూమికి సమాంతరంగా చాపి ఉంచాలి. తర్వాత శ్వాస తీసుకోవాలి.శ్వాస విడుస్తూ నిదానంగా కుడి వైపుకు వెనక్కి తిరగాలి ఎడమ చేయి కుడి భుజం మీద ఉంచాలి,కుడి చేయి వెనుక చాపి ఉంచాలి. ఇలా ఐదు సెకండ్లు పెట్టవలెను. తరువాత శ్వాస తీసుకుంటూ యధా స్థితికి రావలెను. ఇదేవిధంగా ఎడమవైపు కూడా చేయవలెను. దీనివలన ప్రయోజనాలు. నడుము నొప్పి భుజాల నొప్పి మెడ నొప్పి చక్కగా తగ్గుతుంది.

శిథిలీకరణ వ్యాయామములో మూడోది

ఎదురుగా నిటారుగా నిలబడవలెను. తరువాత రెండు పాదాలను మీటర్ దూరంలో ఉంచవలెను.

రెండు చేతులను భూమికి సమాంతరంగా ముందుకు చాపి ఉంచాలి. అరచేతులు నేలవేపు చూసే విధంగా పెట్టాలి.

ఇప్పుడు రెండు ముక్కులతో శ్వాసను ఛాతిలోకి తీసుకోవాలి. తీసుకున్న శ్వాసను విడుస్తూ నిదానంగా మోకాళ్ళని వంచి కొన్ని సెకన్లు వంగి (గోడ కుర్చీలాగా )ఉండాలి. తిరిగి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి .
ఇలా రెండుసార్లు చేయాలి.

ప్రయోజనాలు.
మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

-షేక్ బార్ అలీ
యోగాచార్యులు/ఆయుర్వేద వైద్యుడు

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: శిథిలీకరణ వ్యాయామం

Leave A Reply

Your email address will not be published.