ఆటలమ్మ లేదా చికెన్ ఫాక్స్

వైరస్ వలన కలిగే వ్యాధుల్లో ఆటలమ్మా లేదా చికెన్ ఫాక్స్ అని అంటారు. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవాళ్ళల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇది మినిమం 2 వారాల వరకు ఉంటుంది. ఇది పిల్లల్లో బాక్టీరియల్ న్యూమోనియా వంటి తీవ్రమైన సమస్యలు కలిగిస్తుంది.ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి అయినా వచ్చిపోతుంది.

దీనికి కారణములు. ఇది హెర్పస్ వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వలన వస్తుంది. ఇది దగ్గు, తుమ్ము నుండి చుక్కల ద్వారా వ్యాపిస్తుంది.ఇది ఉష్ణమండల దేశాల పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది. ఇది సోకిన వ్యక్తి యొక్క దుస్తులు ద్వారా ఇతరులకు సోకుతుంది.ఈ వ్యాధినపడిన టీకాలు వేయని వ్యక్తికి వస్తుంది. ఇది అంటువ్యాధి, స్వీయ పరిమితం చేసే ఇన్ఫెక్షన్, కానీ పిల్లలు పెద్దలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇది తీవ్రంగా ఉంటుంది.

వ్యాధి లక్షణాలు…

  • 1. జ్వరం, జలుబు, ముక్కు రంద్రాలు మూసుకోపోవటం.
  • 2. కళ్ల్లు ఎర్రగా కనిపించటం
  • 3. ముఖం మీద ఎరుపు దద్దర్లు,రావటం. గులాబీ రంగు దద్దుర్లు,
  • 4. తెల్లటి నీటి బుగ్గలాంటి కురుపులు ఏర్పడి కొన్నాళ్ళకు మాడిపోతాయి. నల్లటి మచ్చలుగా మిగిలిపోతాయి.
  • 5.తెల్లటి నీటి బొబ్బలు నుండి రసి కారటం జరుగుతుంది..ఈ రసీలో సూక్ష్మ క్రిములు ఉండి దీని ద్వారా కూడా జబ్బులు ఇతరులకు సోకుతుంది.
  • 6.ఇది మెడ నుండి ముఖం వరకు వ్యాపిస్తుంది.
  • 7.ఛాతి, వీపు,చుట్టు జన నేంద్రియలు పై కూడా వస్తుంది.,నోటిలోపల, కనురెప్పలపైన,అక్కడి నుండి శరీరానికి పాకుతుంది.

ఆయుర్వేదంలో చికెన్ ఫాక్స్ కి “లఘు మసూరిక “అంటారు.వాత, పిత్త, కఫ, దోషాల అసమత్యులంతో రావటం ఉంటుంది.

తీవ్రమైన చర్మం నొప్పి,ఎరుపు రంగు, గులాబీ రంగు దద్దర్లు, చర్మం దురదగా ఉండటం.బద్ధకం, నిరంతరం నిద్రపోవటం,
జ్వరం, వాంతులు, మగతగా ఉండటం, ఆకలి లేకపోవటం, తలనొప్పి, పొత్తి కడుపు నొప్పి,
సాధారణంగా ఇది చికెన్ ఫాక్స్ సోకిన వ్యక్తి నుండి నేరుగా చర్మం నుండి చర్మానికి సంపర్కరం ద్వారా శ్వాస కోస బిందువుల ద్వారా సంక్రమిస్తుంది.ఇది ఒక వారంలో స్కాబ్లుగా మారి తగ్గుతుంది.

చికెన్ ఫాక్స్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • స్నానానికి గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి కలపి స్నానం చేయాలి.
  • స్నానానికి నీళ్ళల్లో వేపాకులు వేసి మరిగించి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి.
  • గుగ్గిళం సాంబ్రాణి కలిపి దూపం వేయండి, ఇంట్లో వైరస్ క్రిములు చస్తాయి.
  • ఉతికిన శుభ్రమైన బట్టలు తొడగాలి.
  • అందరికి దూరంగా ఉండాలి. పరిశుభ్రత వున్న ప్రాంతంలో ఉండాలి.
  • బత్తాయి రసం, కమల పండ్ల రసం, బాదాం, అంజీరా, ఖార్జురమ్, జీడిపప్పు తినాలి.
  • ఆవు నెయ్యి, ఆవు పాలు, మజ్జిగ ఇవ్వాలి.
  • మజ్జిగ అన్నం, మజ్జిగ చాలా శ్రేష్ఠమైనది.
  • పడుకునే మంచం మీద కొన్ని వేపాకులు వేసి దాని మీద దుప్పటి వేసి పడుకువాలి.
  • ఉదయంపూట ఒక చెంచా తులసిరసం, ఒక చెంచా తేనే కలిపి నాకించండి.
  • లేదా ఒక చెంచా తేనే, ఒక చెంచా వెల్లుల్లి రసం కలిపి నాకించండి.
  • Ayurveda మందులు. అరవిందసవ.. ఉదయం ఒక tea స్పూన్, సాయంత్రం ఒక tea స్పూన్ నీటితో కలిపి నాకించండి.
  • చందానసవ.. ఉదయం /సాయంత్రం ఒక tea స్పూన్ నీటితో నాకించండి.
  • జ్వరం ఉంటే ఆనందభైరవీరాస మాత్రలు ఉదయం ఒకటి /రాత్రి ఒకటి ఇవ్వండి.
  • ఒంటిపై చర్మం మీద పొక్కులు ఉంటే మహమరిచాది తైలం రాయండి.
  • రోగిని ఆరోగ్యవసంతుల నుండి దూరంగా పెట్టాలి.
  • తులసి, వేప, వాసా, కాటుకరోహిణి, పసుపు వాటిని కాషాయం వైద్యుల సలహా మేరకు వాడాలి.
  • కాకరకాయ రసం, పచ్చి పసుపు రెండు కలిపి 10-20 మిల్లి. ఉదయం సాయంత్రం సేవించాలి.
  • ఆయుర్వేదంలో ఖాదిరా రిష్టం. అమృతాది క్వాదం డాక్టర్ సలహా మేరకు ఎదో ఒకటి దీనిలో వున్న ayurveda medicine వాడితే చికెన్ ఫాక్స్ తగ్గుతుంది.

-బహార్ అలీ.
సెల్ 7396126557

1 Comment
  1. zoritoler imol says

    I have been absent for a while, but now I remember why I used to love this website. Thank you, I will try and check back more often. How frequently you update your site?

Your email address will not be published.