రేపు హస్తినకు ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు (శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి ముఖ్యమంత్రి పయనం కానున్నారు.
కాగా ఈ నెల 25న (శనివారం) కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. 26న విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయెల్‌తో కెసిఆర్ సమావేశమై చర్చిస్తారు. 26వ తేదీ సాయంత్రం సిఎం కెసిఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.