CLiC2NEWS తొలి వార్షికోత్సవ సంబరాలు!

హైదరాబాద్ (CLiC2NEWS): వెబ్ యుగంలో `CLiC2NEWS` ఒక నిశ్శబ్ద విప్లవం. `no favour, no fear` అనే ఉన్నతాశయాలతో ప్రారంభమైన `CLiC2NEWS` వెబ్సైట్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. గత ఏడాది పంద్రాగస్టు రోజున మొదలై.. ఈనాటి 75వ స్వతంత్య్ర దినం రోజున రెండో వసంతంలో అడుగిడుతోంది. 15-08-2020న ప్రారంభమైన CLiC2NEWS తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటింది. జర్నలిజంలో నాణేనికి రెండో కోణాన్ని ఆవిష్కరిస్తూ సామాన్యుడికి, ప్రజా సమస్యలకు పెద్దపీట వేసింది. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా రాస్తూ.. ప్రజాభీష్టాన్ని పాలకులకు తెలియబరిచే యత్నం చేసింది. CLiC2NEWS మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని CLiC2NEWS ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది జి.కె.దేశ్పాండే, శ్రీమతి వర్షా దేశ్పాండే, ఎడిటర్, ఇతర ఎడిటోరియల్ సిబ్బంది ఇందర్పాల్సింగ్, యెట్టయ్య గడ్డగూటి, సతీష్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జి.కె.దేశ్పాండే కేక్ కట్చేసి వేడుకలను ప్రారంభించారు.
తప్పకచదవండి:దిగ్విజయంగా ద్వితీయ వసంతంలోకి..
ఈ సందర్భంగా జి.కె.దేశ్పాండే మాట్లాడుతూ.. విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న CLiC2NEWSకు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధత, నిర్ధుష్టత నిజాయితీలే ఆరవ ప్రాణంగా `no favour, no fear` అనే ఉన్నతాశయాలతో ప్రారంభమైన ఈ `CLiC2NEWS` సామాన్యుడి పక్షాన నిలబడాలని అన్నారు. సమాజాంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూనే.. మరెన్నో మైలురాళ్లను సాధించాలని పేర్కొన్నారు. యువ జర్నలిస్టుల సారధ్యంలో అక్షర సమరం చేస్తూ మరింత ముందుకు దూసుకెళ్లాలని పేర్కొన్నారు. దిన దినాభివృద్ది చెందుతూ ప్రభుత్వానికి, ప్రజలకు, మరియు అధికారుల కు మధ్య వారధిలా నిలవాలన్నారు. సమాజంలో మార్పు కోసం, ప్రజలలో చైతన్యం కోసం మరింత కృషి చేయాలన్నారు. నిబద్ధత, నిర్ధుష్టత గల వార్తలు రాజ్యాంగ విలువలను బలపరుస్తాయని అన్నారు. నిష్పక్షపాత వైఖరి గల న్యూస్ వెబ్సైట్లు ప్రభుత్వ పనితీరును తనిఖీ చేస్తుందని.. అలాగే అవి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయని ఆయన అన్నారు. `CLiC2NEWS` వెబ్సైట్ అతి తక్కువ కాలంలో నే అందరి ఆదరాభిమానాలు పొందిన సందర్భంగా సిబ్బందికిహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.