తిరుపతి ఘటన .. సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి (CLiC2NEWS): తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై సిఎంచంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలిచివేసిందని.. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు పర్యవేక్షించాలని సిఎం అధికారులను ఆదేశించారు.