దావోస్‌లో ఎపి పెవిలియన్‌ను ప్రారంభించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సిఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో సిఎం పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాప్‌తో సిఎం సమావేశమయ్యారు. సదస్సుకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎపి మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.