ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ భూమిపూజ‌లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి గురువారం న్యూఢిల్లీలోని వ‌సంత్‌విహార్‌లో శంకుస్థాప‌న జ‌రిగింది.  ఇవాళ మ‌ధ్యాహ్నం 1.48 గంట‌ల‌కు పార్టీ అధినేత‌, తెలంగాణ సిఎం కెసిఆర్ భూమి పూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

రూ.40 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి భవన్‌ను నిర్మించనున్నారు. ఈ భ‌వ‌నంలో మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప‌లు పనుల మీద వచ్చే వారు ఉండేందుకు వీలుగా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. అయితే ఢిల్లీలో ఏర్పాటు చేయ‌బోయే టిఆర్ఎస్ భవన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని పార్టీకి చెందిన ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.