నగరంలో పలు కీలక ప్రాజెక్టులకు సిఎం శంకుస్థాపన

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల్లో పాల్గొన్నారు. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సిఎంతో పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు మంగళవారం సిఎం శంకుస్థాపన చేశారు. రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు, గ్రేటర్ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ.16.50 కోట్లతో నిర్మించిన భూగర్భ సంపులను ప్రారంభించారు.
దేశంలోనే అతిపెద్ద ఎస్‌టిపిని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. కెబిఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధి , 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు.