ఒకే వేదికపై హాజరైన తెలుగు రాష్ట్రాల సిఎంలు
స్పీకర్ పోచారం మనవరాలి పెళ్లి..

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కెసిఆర్, జగన్ హాజరయ్యారు. పోచారం మనవరాలిని ఓఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. శంషాబాద్‌లోని విఎన్ఆర్ ఫార్మ్స్‌లో ఆదివారం ఘనంగా వివాహం జరింగింది. ఈ వివాహ వేడుకలో ఇరు రాష్ట్రాల సిఎంలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వివాహ వేడుకను వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎపి స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు.