TS: గురుకుల పాఠ‌శాల‌లో 27 మందికి క‌రోనా..

 ఖ‌మ్మం(CLiC2NEWS): ఖ‌మ్మం జిల్లాలో వైరా గురుకుల పాఠశాలలో చదువుతున్న 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై గురుకులంలోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ కొంత మంది విద్యార్థులకు కొవిడ్ నిర్థార‌ణ‌ పరీక్షలు చేయించారు. 27మంది విద్యార్థ‌లకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ది. దీంతో వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది గురుకులంలో ఉన్న అందరు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.