ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంక్షేమానికి సిఎం కృషి..
-ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

మండపేట (CLiC2NEWS): ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక పెన్షనర్ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని త్వరలోనే పీఆర్సీ, డిఏల విషయమై ఐక్య కార్యచరణ సమితితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా మాజీ జెఎసి చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ ఉపాద్యక్షులు, తూర్పు గోదావరి జిల్లా ఎన్జీవోల మాజీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం మర్యాద పూర్వకంగాకలిశారు. ఈ సంధర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమన్వయం పాటించాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు, వాలంటరీ వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామాలలో అనేకమంది యువతీ, యువకులు వాలంటరీ వ్యవస్థలో పని చేసి జీవనోపాధికి ఆర్ధికంగా పరిపుష్టి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే నన్నారు. రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత అనేకమంది ఉద్యోగులుగా నియామకమై, ఈనాడు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసు రిజిష్టర్లు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఉద్యోగ నియామకాల జాబ్ కార్డులను ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి దేనని అన్నారు.