ఎయిర్‌పోర్టులో రూ. 80కోట్ల విలువైన కొకైన్..

హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 80 కోట్ల విలువ చేసే కొకైన్‌ను డిఆర్ ఐ అధికారులు పట్టుకున్నారు. టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుండి 4కేజీల చొప్పున కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశామని, డ్రగ్స్ తరలిస్తున్న సమాచారంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని అధికారులు వెల్లడించారు. జనవరి నుండి ఇప్పటి వరకు దేశంలో వివిధ ఎయిర్ పోర్టుల్లో పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం రూ. 3,500 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.