Hyderabad: నిజాంపేటలో కూలిన రెండంతస్తుల భవనం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నిజాంపేటలో నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనం బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్ ఆర్ ఐ కాలనీలో నిర్మాణ పనులు జరుగుతున్న భవనం కూలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడ్డారు. నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని అధికారులు భావిస్తున్నారు.