కృషి విజ్ఞాన కేంద్ర న్యూతన వ్యవసాయ పంటలను పరిశీలించిన కలెక్టర్
మంథని (CLiC2NEWS): మంథని మండలంలోని నాగారం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్ర గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోడి పిల్లలు పంపిణీ చేశారు. అలాగే నూతన వ్యవసాయ పద్ధతి పంటల గురించి కృషి విజ్ఞాన కేంద్రం వారిని అడిగి తెలుకొన్నారు. ఈ సందర్భంగా పంటల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంథని వ్యవసాయ మార్కెట్ చైర్పసన్ శ్రీరాంబట్ల సంతోషి . జడ్పీటీసీ తగరం సుమలత, మంథని PACS చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాగరం గ్రామ సర్పంచ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.