కొండంపెట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లాలోని కొండంపేట్ గ్రామం లో పోలీసులు క‌మ్యూనిటి కాంటాక్ట్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జైపూర్ సబ్ డివిజ‌న్, చెన్నూర్ రూరల్ సర్కిల్, కొటపల్లి పోలీస్ స్టేషను పరిదిలోని మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సురేష్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా స్పెషల్ పార్టీ, టిఎస్ఎస్పి, స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి ఏరియా డామినేషన్, మరియు మావోయిస్టు ప్రబావిత గ్రామలలొని సందర్శించి, ఆ దారిలోని కల్వర్టు లను తనిఖీ చేశారు.

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్య‌క్ర‌మం ద్వారా గ్రామంలోని వారితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు అయిన ఉన్నాయని.. మావోయిస్టులకు సంభందించిన‌ కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని ఆరా తీశారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని.. మీ భద్రత మా బాద్యత అని వారికీ భ‌రోసా ఇచ్చారు. మావోలు గాని అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే, ఎలాంటి సమాచారం ఉన్న సంబందిత అధికారులకు తెలియ‌జేయాల‌న్నారు. . సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు .

Leave A Reply

Your email address will not be published.