ఒకే దేశం, ఒకే పోలీసు.. సమిష్టి సహకారంతో కలిసి పనిచేద్దాం!
జహీరాబాద్ (CLiC2NEWS): ఒకే దేశం ఒకే పోలీసు విభాగంగా సమిష్టి సహకారంతో కలిసి పనిచేద్దామని కార్ణటక, మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో అంతరాష్ట్ర సరిహద్దు భద్రత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు భద్రత, నేర నియంత్రణ, నేరస్థుల అప్పగింతపై మాట్లాడారు. అంతరాష్ట్ర నేరస్థుల కదలికలు తగ్గుముఖంగా ఉన్నప్పటికీ సమాచార బదిలీతో అడ్డుకట్ట వేయాలన్నారు. పరస్పర సహకారంతో గాంజాయి, మాదకద్రవా్యాలు, మద్యం, దోపిడి దొంగలు, అక్రమ రవాణాను కట్టడి చేద్దామన్నారు.