అవయువదానానికి అనుమతి కోరుతూ కోర్టుకెళ్లిన మైనర్
తిరువనంతపురం (CLiC2NEWS): కన్నతండ్రికి అవయువదానం చేయాలనుకుంది ఓ అమ్మాయి. కానీ ఆమె మైనర్ కావడంతో ఆస్పత్రి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిస్సుర్ ప్రాంతానికి చెందిన ఏళ్ల ప్రతీశ్(48) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన బాధను చూడలేక అతని కుమార్తె దేవానంద (17).. కిడ్నీని దానం చేయాలనుకుంది. కుటుంబసభ్యులు, స్థానికులు వద్దని వారించినా.. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కానీ ఆమె మైనర్ కావడంతో ఆస్పత్రి నిరాకరించింది. అవయువ దానం చేయాలంటే కనీసం 18 సంవత్సరాల వయసు దాటాలి. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. మెడికల్ బోర్డుకు నివేదిక సమర్పించి.. దాతగా మారేందుకు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరింది.
తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తన తండ్రిని కాపాడుకోవాలనే కోరిక, ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలు ఫలించి కోర్టు ఆమెకు అవయుదానానికి అనుమతి నిచ్చింది. తొలి అవయువ దాతగా ఘనత సాధించింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆరోగ్య మంత్రి ప్రశంసించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆమెను అభినందించి.. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు అదృష్టవంతులన్నారు.