జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడి హత్య

జగిత్యాల (CLiC2NEWS): జిల్లాలోని జాబితాపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు , మాజి ఎంపిటిసి మారు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. గంగారెడ్డిని సంతోష్ అనే వ్యక్తి ఆదివారం కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన గంగారెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.ఈ హత్యకు నిరసగనగా జగిత్యాల బస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు