20 ఏళ్లలో మూడు సార్లు ప్రమాదానికి గురైన కోర‌మాండ‌ల్‌..

భువ‌నేశ్వ‌ర్‌ (CLiC2NEWS): కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ 20 ఏళ్లలో మూడు సార్లు ప్ర‌మాదానికి గురైంది. మూడు సార్లు చెన్నై వెళ్లే క్ర‌మంలోనే జ‌రిగింది. దీనిలో రెండు సార్లు ఒడిశాలో, ఒక‌సారి ఎపిలో ప్ర‌మాదానికి గురైంది. ఇక ఈ మూడు సార్లు శుక్ర‌వారమే జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ట్రైన్ ఇంజ‌న్ గూడ్స్‌రైలు మీద‌కి దూసుకుపోయింది. రైలు బోగీలు చెల్ల‌చెదురుగా ప‌డిపోయాయి. ఒక బోగీ భూమిలోకి కూరుకుపోయింది. దీనిలో మ‌రికొంత మంది చిక్కుకుపోయి ఉంటార‌ని చెబుతున్నారు. ట్రైన్ కొంచెం ముందు వ‌చ్చి ఉంటే.. ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండేద‌ని అధికార‌లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎక్స్ ప్రెస్ వేగం 110 కిలో మీట‌ర్లు ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్ర‌మాద స్థలాన్ని ప‌రిశీలించ‌డానికి బాలేశ్వ‌ర్‌కు చేరుకున్నారు.

రైలు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించిన ప్ర‌ధాని మోడీ

Leave A Reply

Your email address will not be published.